Picture Perfect: A Guide to Choosing the Ideal Camera for Every Occasion

Happy Independence Day
అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ప్రతిఒక్కరు మనం హ్యాపీ గా ఉండటానికి కారకులైన స్వాతంత్య్ర సమరయోధుల గురించి ఒక్క సారి అయినా గుర్తు చేసుకోవాలి. పూర్వం మన భారతదేశం స్వాతంత్రం లేని రోజుల్లో మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించేవాళ్లు. ఇక్కడ పాలన అంటే రాజ్య పాలన కాదు బానిస పాలన. మన బ్రతుకులు వాళ్ళ కాలి బ్రొటన వేలి లో ఉండేవి. అంటే ఇక్కడ ఎంత హీనంగా చూసే వాల్లో అర్థం చేసుకోవాలి. ఇటువంటి బానిస బ్రతుకులు బరించలేక, రాబోయే తరాల వారికి (అంటే మనకి) ఇటువంటి బానిసత్వం ఉండకూడదు అని, తన ప్రాణం పోయినా పర్లేదు మనకు స్వాతత్ర్యం ఉండాలని ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు.
ఒక్క ముళ్ళు గుచ్చు కుంటేనే మనం విల విల లాడుతాం. అలాంటిది వంద తుపాకీ తూటాలు తమ శరీరాన్ని చీల్చుకుంటూ పోతున్నా, రక్తం ఏరులై పారుతున్నా, తమ దేహం లో చివరిగా మిగిలి ఉన్న ఒక్క రక్తపు బొట్టు అయినా ఈ దేశానికి ఉపయోగ పడాలి అని చివరి శ్వాస విడిచే వరకు పోరాటం చేశారు. అప్పటి వాళ్ళ ప్రాణాలకు ఫలితమే మనం ఇప్పుడు అనుభవిస్తున్న హ్యాపీనెస్.
స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు మన దేశం వదిలి వెళ్ళిపోయారు. దేశం లో రాజ్యాంగ పరిపాలనకు బీజం పడింది. ప్రజలు కు నచ్చిన వాడే దేశాన్ని రూల్ చెయ్యొచ్చు. కులాలకి మతాలకు అతీతంగా మన భారత దేశం లౌకిక రాజ్యంగా విరాజిల్లింది. ఎన్నో నాగరికతలు, ఎన్నో సంస్కృతి లు, ఎన్నో పద్ధతులు నమ్మకాలు. నిజం గా ఇటువంటి దేశం లో పుట్టినందుకు ప్రతి భారతీయుడు గర్వపడాలి.
కానీ ఎప్పటికీ ఈ స్వాతంత్య్రం ఒకేలా ఉండదు గా. మనం మనుషులం కదా. మనుషులకి ఉన్న ఒకే ఒక్క శాపం అత్యాశ మరియ నాది అనే గర్వం. తప్పులేదు freedome ఎక్కువ అయిపోయింది. పురాణాల్లో చెప్పినట్లు కలి యుగం మొదలు అయ్యింది కదా. కుట్రలు కుతంత్రాలు, పక్క వారిపైన కుల్లులు, స్వార్ధాలు, అధికారాలు, హత్యలు, వ్యామోహం, అవినీతి ఇలా మానవుడు ఎనలేని స్వాతంత్రం తో బ్రతుకుతున్నారు. ఈ కలియుగ దుర్మార్గాలను నశింప చేయటానికి సాక్షాత్తు ఆ శ్రీ హరి భగవానుడు కల్కి రూపం దాల్చి స్వఛ్చ మైన స్వాతంత్ర్య న్ని తీసుకుని వస్తాడని పురాణాలు చెప్తున్నాయి. చూద్దాం ఎవరు వస్తారో..
కట్ చేస్తే, ప్రస్తుతం దేశం సంతోషం గా ఉంది అంటే పొరపాటు. ఎన్నో రకాల ప్రమాదాల నుండి దేశం పోరాటం చేస్తోంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇతర దేశాల దేశ ద్రోహుల దాడులు నుండి. అప్పటి స్వాతంత్ర పోరాటం లో తమ ప్రాణాన్ని అడ్డుగా పెట్టారు. ఇప్పుడు ఉన్న స్వాతంత్య్రాన్ని కాపాడేందుకు ఇప్పటి స్వాతంత్ర సమర యోధులు దేశం లో ఉన్న అన్ని కుటుంబాలకు రక్షణగా తమ ప్రాణాలను అడ్డుకట్టగా వేసి దేశాన్ని కాపాడుతున్నారు. ఇటువంటి దేశం లో మనం ఉండటం నిజంగానే వరం అని చెప్పుకోవాలి. సరి లేరు నీకెవ్వరు సినిమా లో చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. "ఎవరో తెలియని వాళ్ళకోసం అంత సులభంగా ఎలా ప్రాణాలు ఇచ్చేస్తారు" అని. నిజమే ఈ మాట విన్నప్పుడల్లా రోమాలు నిక్కబొడుచుకుంటున్న ఫీలింగ్ వస్తుంది కదా.
ఇటువంటి దేశం లో నువ్వు పుట్టి ఉన్నావు. నీకు మరియు నీ కుటుంబానికి ఇంత చేస్తున్నా దేశానికి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు పుట్టిన ఈ గడ్డకి నీ వల్ల ఉపయోగం ఏమిటి? ఒక్కసారి ఆలోచించాలి. అరే నేను సాధారణమైన మానవుడిని, మధ్యతరగతి లేదా పేద కుటుంబీకుడిని, నేనేమైనా రాజకీయ నేతన? లేదా CM, PM నా? నేనేమీ చేయగలను అని మీకు సందేహం రాగలదు. శ్రీ శ్రీ గారు ఒక మాట అన్నారు "దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్". అంటే నువ్వు నీ తోటి మనిషికి ఒక్కరికీ చిన్న సాయం చేసిన నువ్వు దేశానికి సహాయం చేసినట్టే, నీ దేశానికి నువ్వు రుణం తీర్చు కున్నట్టే, నీకోసం ప్రణలిస్తున్న సైనికుల ప్రాణానికి శాంతి చేకూరి నట్టే. కానీ ఇలా అయిన ఉన్నామా మనం అంటే పూర్తిగా కాదు అనే చెప్పాలి. ఎందుకంటే వీటి అన్నింటినీ స్వార్థం అనే బూతం వశీకరణ చేసుకుని లోబడ్చుకుని ఉంది మనల్ని. కానీ చాలామంది ఎదుట వారికి సాయం చేస్తున్నారు. రియల్లీ appriciate of their work 👏👏.
మిగిలిన వాళ్ళకి గానీ అవకాశం ఉంది దేశానికి తమ వంతు కృషి చేసుకోవటానికి. ఒక వ్యక్తి కి సాహాయం చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు అని అనుకుందాం. ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి సహాయం అంటే ధన సహాయం కాదండోయ్. ఒకరికి మంచి జరగాలని దేవుడిని వేడుకున్నా మీరు సహాయం చేసినట్లే.
కొంత మంది అంటారు నా గురించి ఎవరూ పట్టించుకోరు ఎదుట వారిని నేను ఎందుకు పట్టించు కోవాలి అని అంటారు. గుడ్ మీకు తెలియకుండానే మీరు వాళ్ళకి సహాయం చేసినట్లే ఎలాగో చెప్తాను.
మీరు ఎదుట వారి మంచిని కోరకపోయిన, సహాయం చేయక పోయినా, మీరు వాళ్ళ గురించి ఆలోచించట్లేదు మరియు పట్టించు కోవటం లేదు. ఇది ఇంకా పెద్ద సహాయం ఎలా అంటారా ప్రస్తుతం మంచి చేసే వాళ్ళ కంటే చెడు చేసే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. ఎదుట వారికి చెడు చెయ్యాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పాను గా కలియుగ లక్షణం అని తప్పులేదు. పక్క వారికి ఎలా అయిన చెడు చెయ్యాలి, నాశనం అయిపోవాలి, నేను బాగు పడకపోయినా పర్లేదు ఎదుట వాడు మాత్రం బాగుపడకూడదు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
సో మంచి చేయకున్నా పర్వాలేదు చెడు చేయక పోవటం కూడా మంచి చేసినట్లే కదా.. అంటే ఎదుట వారిని పట్టించుకోవట్లేదు అంటే మీరు వాళ్ళని మంచి కోరటం లేదు మరియు చెడుని కోరటం లేదు. అంటే మీరు కూడా మంచి చేస్తున్నారనే కదా, అంటే దేశానికి మీ వంతు కృషి చేస్తున్నారనే కదా.
కాబట్టి ఇప్పటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, మీరు ఒకరికి ప్రత్యేకంగా మంచి చేయనవసరం లేదు అట్లీస్ట్ చెడు చేయకుండా ఉండటమే వాళ్ళకి చేసే మంచి. మరియు దేశానికి చేసే మంచి.
జై హింద్...
Thank You
- Phanindra Kumar Pedipini
Comments
Post a Comment